'ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదు'
శ్రీకాకుళం M సింగుపురం ఘటన పై ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. జాతరలో బాదం పాలు తాగి పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై కలెక్టర్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్వాపరాలను, యంత్రాంగం చేపట్టిన చర్యలను ఆయన వివరించారు. మెరుగైన వైద్యం అందుతుందని, ఇప్పటికే చాలా మంది కోలుకున్నారని తెలిపారు.