జనవాణిలో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

GNTR: జనసేన పార్టీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక జనవాణి కార్యక్రమం సోమవారం మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు. పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ హాజరై, ప్రజల సమస్యలను విని అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పార్టీ కట్టుబడి ఉందని, వాటిని తక్షణమే సంబంధిత శాఖలకు పంపించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.