VIDEO: సూర్యాపేటలో సర్పంచ్ నామినేషన్లపై ఉద్రిక్తత
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(S) మండలం పాతర్లపహాడ్ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ సర్పంచ్, వార్డు అభ్యర్థుల నామినేషన్లు ఎన్నికల అధికారులు తిరస్కరించడంతో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నాయకులతో అధికారులు కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగా నామినేషన్లు రద్దు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై రెండు పార్టీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.