ఉత్కృష్ట పతకాన్ని అందుకున్న డీసీపీ

ఉత్కృష్ట పతకాన్ని అందుకున్న డీసీపీ

JN: పోలీస్ విభాగంలో ఉత్తమ సేవలు అందించిన వారికి కేంద్ర ప్రభుత్వం ఉత్కృష్ట పతకాన్ని అందించింది.ఇందులో భాగంగా వెస్ట్ జోన్, జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్‌కు వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రీత్ సింగ్ అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచే అధికారులకు శాఖాపరమైన గుర్తింపు తప్పకుండా ఉంటుందని తెలిపారు.