'పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది'

AKP: మాడుగుల భారత నిర్మాణ సేవా సంస్థ ప్రతినిధులు మట్టి వినాయక ప్రతిమల పంపిణీని చేపట్టనున్నారు. ఇందులో భాగంగా మొదటి ప్రతిమను శుక్రవారం మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, మట్టి వినాయకుని పూజించడం వలన పర్యావరణాన్ని కాపాడిన వారు అవుతారన్నారు.