సాయి శ్రేష్ఠితను సన్మానించిన బండి సంజయ్
HNK: ఇంటర్ ఫలితాల్లో 997 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచిన సాయి శ్రేష్ఠితను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నేడు సన్మానించారు. విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యమని, భవిష్యత్తులో మరింత కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సాయి శ్రేష్ఠితకు బండి సంజయ్ సూచించారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.