Video: రేచు కుక్కల దాడిలో రైతుకు తీవ్ర గాయాలు

ప్రకాశం: గిద్దలూరు మండలం ఉప్పలపాడు సమీపంలోని పొలాలలో రేచు కుక్కలు రైతుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. మంగళవారం అర్ధరాత్రి గ్రామానికి చెందిన మానం కిట్టయ్య తన పొలం వద్ద ఇటీవల వేసిన బోరుకు కావిలి వెళ్లాడు. అటువైపు వచ్చిన రేచు కుక్కలు కిట్టయ్యపై దాడి చేశాయి. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు.