పేకాట శిబిరంపై దాడి.. ఆరుగురు అరెస్ట్
కృష్ణా: తోట్లవల్లూరు మండలం వల్లూరిపాలెం కరకట్ట వద్ద పేకాట శిబిరంపై పోలీసులను నిన్న దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురుని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 7 మోటార్ సైకిళ్లు, రూ.12,200 నగదును స్వాధీనం చేసుకున్నారు. మండల వ్యాప్తంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పమని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.