బాలుడికి అండగా ఉంటా: జక్కిడి రఘువీర్‌రెడ్డి
RR: మన్సురాబాద్ డివిజన్ శివగంగకాలనీలో ఇటీవల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జక్కిడి రఘువీర్ రెడ్డి నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి బాలుడి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం తన తరఫున ఆర్థిక సహాయం చేశారు. ఏ అవసరం ఉన్న అండగా ఉంటామని హామీ ఇచ్చారు.