ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
AKP: మండల కేంద్రమైన నక్కపల్లి మెయిన్ రోడ్డు ఎస్సీ కాలనీ వద్ద బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ మాట్లాడుతూ.. ఉప ప్రధానిగా దేశంలో అట్టడుగు వర్గాల వారి అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ చేసిన కృషి మరువలేనిదన్నారు.