'ప్రాణాలు పోతే గానీ పట్టించుకోరా?'
NZB: సిరికొండ మండలంలోని గడ్కోలు శివారు హమాలీ చెరువు కట్టపై విద్యుత్ స్తంభాలు వంగి, తీగలు కిందికి వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. రెండేళ్లుగా అధికారులకు మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు.