మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన మున్సిపల్ ఛైర్మన్

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన మున్సిపల్ ఛైర్మన్

ప్రకాశం: కనిగిరి బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం మున్సిపల్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ ఆకస్మికంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి, వారితో మాట్లాడి భోజనం నాణ్యతపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని ఆయన సంబంధిత సిబ్బందికి సూచించారు.