శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో 'స్వాతి' వేడుకలు

శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో 'స్వాతి' వేడుకలు

NDL: ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో స్వామి జన్మనక్షత్రం స్వాతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి మూల మూర్తిని పంచామృతాలతో అభిషేకించి నిత్య ఆరాధనలు చేశారు. ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ ముఖద్వారం మండపంలో కొలువుంచారు.