విద్యుత్ షాక్‌తో రైతు మృతి
సిరిసిల్ల: పొలం వద్ద విద్యుత్ షాక్‌తో ఓ రైతు మృతి చెందిన సంఘటన చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన అంబిరీ లింగం (65) అనే రైతు ఇంటి నుండి పొలం వద్దకు వెళ్లాడు. పొలం పనుల నిమిత్తం వెళ్లిన తండ్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుమారుడు పూర్ణచందర్ పొలం వద్దకు వెళ్లి చూడగా, మోటార్ స్టార్టర్ బాక్స్ వద్ద పడి ఉన్నాడు.