పదవీ బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్‌

పదవీ బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్‌

MDK: రామాయంపేట పురపాలక సంఘం నూతన కమిషనర్‌గా బీ.శ్రావణ్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గ్రూప్-1 అధికారిగా ఎంపికైన ఆయనకు మున్సిపల్ కమిషనర్‌గా ఇది మొదటి పోస్టింగ్ కావడం విశేషం. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, పురపాలక సంఘం ద్వారా ప్రజలకు అందాల్సిన సేవలను ఎటువంటి జాప్యం లేకుండా సకాలంలో అందజేస్తాన్నన్నారు