విద్యార్థుల కోసం ఆరోగ్య కేంద్రం: వీసీ రాజిరెడ్డి

HYD: రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం వీసీ దండా రాజిరెడ్డి ప్రారంభించారు. విద్యార్థులకు వైద్య సేవలు అందించేందుకు రోజూ డాక్టర్ అందుబాటులో ఉంటారని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేందుకు విశ్వవిద్యాలయం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. రిజిస్ట్రార్ భగవాన్, డీన్ చిన్నానాయక్ పాల్గొన్నారు.