దిత్వా తుఫాన్.. విద్యుత్ శాఖ అప్రమత్తం

దిత్వా తుఫాన్.. విద్యుత్ శాఖ అప్రమత్తం

AP: దిత్వా తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. APCPDCL సర్కిల్స్ పరిధిలో, కృష్ణా, బాపట్ల, ఒంగోలులో కంట్రోల్ రూమ్‌లను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి రవి దిశానిర్దేశం చేశారు. విద్యుత్ సమస్య తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.