మున్నేరు వరద ప్రవాహాన్ని పరిశీలించిన మంత్రి తుమ్మల

KMM: నగరంలోని ప్రకాష్ నగర్ వంతెనపై నుంచి మున్నేరు వరద ప్రవాహాన్ని శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవ్వరు ఆందోళన చెందవద్దని చెప్పారు. అటు అధికార యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గత వరద అనుభవాలు దృష్టిలో పెట్టుకుని సహాయ చర్యలకు ప్రణాళిక సిద్ధం చేసి సన్నద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.