VIDEO: ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
ASF: ఆసిఫాబాద్ పట్టణంలోని ఆదిలాబాద్ X రోడ్డు వద్ద ఎస్సై శ్యాంరావు జాడే బుధవారం ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. వాహనదారులకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలు లేకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.