ఈనెల 16 జాబ్ మేళా

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిరుద్యోగుల కోసం ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రజిత శనివారం తెలిపారు. ఈనెల 16న ములుగు రోడ్డులోని ఐటీఐ క్యాంపస్‌లో జరిగే ఇంటర్వ్యూలకు అర్హులైన ఇంటర్, డిగ్రీ అభ్యర్థులు హాజరుకావాలని సూచించారు. ముత్తూట్ మైక్రోఫిన్ లిమిటెడ్‌లో రిలేషన్షిప్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.