నేడు కడపలో సీఎం చంద్రబాబు పర్యటన

నేడు కడపలో సీఎం చంద్రబాబు పర్యటన

AP: కడప జిల్లాలో సీఎం చంద్రబాబు ఇవాళ పర్యటించనున్నారు. కమలాపురం నియోజకవర్గ పరిధిలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. ఆ తర్వాత టీడీపీ క్యాడర్‌తో మీటింగ్‌కు హాజరుకానున్నారు. అనంతరం అమరావతిలో సీపీఐ నేత రామకృష్ణ కుమార్తె వివాహ వేడుకకు వెళ్లనున్నారు.