'రైతులకు రూ.20 వేలు నష్టపరిహారం అందించాలి'

KMM: పాలేరు ఎడమ కాలువ ఆయకట్టు పంటల సాగు కోసం నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఎడమ కాలువ గండ్లను పూడ్చి రైతులకు నీళ్లు అందించడంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. నీళ్లు అందక నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ.20 వేలు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.