VIDEO: కనిగిరిలోని శివాలయాలలో భక్తుల రద్దీ
ప్రకాశం: కనిగిరిలోని పలు శివాలయాలు భక్తులతో రద్దీగా మారాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా పట్టణంలోని శ్రీ విజయ మార్తాండేశ్వర స్వామి, శ్రీ ఉమామహేశ్వర స్వామి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాలకు వేకువ జాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు భక్తిశ్రద్ధలతో ఆలయ ప్రాంగణాల్లో కార్తీక దీపాలను వెలిగించి, శివునికి అభిషేకాలు నిర్వహించారు.