కొవ్వూరు CHCని అప్‌గ్రేడ్ చేయాలి: ఎమ్మెల్యే

కొవ్వూరు CHCని అప్‌గ్రేడ్ చేయాలి: ఎమ్మెల్యే

E.G: కొవ్వూరు CHC సెంటర్‌ను 150 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని కోరుతూ ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరవ్‌కు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రతిపాదనలు అందజేశారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందాలంటే ఆసుపత్రి విస్తరణ అత్యంత అవసరమని తెలియజేశారు. ఈ అంశంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.