పేకాట స్థావరంపై పోలీసుల దాడులు
RR: గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో షాద్ నగర్ పట్టణంలోని అయ్యప్ప కాలనీలో పేకాట స్థావరంపై గురువారం సాయంత్రం ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.1.64 లక్షల నగదుతో పాటు ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.