ఆలూరు కోన భక్తుల ఏళ్ల నాటి కల సాకారం

ఆలూరు కోన భక్తుల ఏళ్ల నాటి కల సాకారం

ATP: ​తాడిపత్రి మండలం ఆలూరు కోన రంగనాయక స్వామి ఆలయానికి వెళ్లే రహదారి సమస్యకు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి శాశ్వత పరిష్కారం చూపారు. గత కొన్ని ఏళ్లుగా సరైన రోడ్డు లేక భక్తులు, గ్రామస్థులు వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే వెంటనే స్పందించి, ఆలూరు నుంచి ఆలూరు కోన వరకు పూర్తిస్థాయి రహదారి నిర్మాణం చేయించారు.