చియా గింజలు ఎప్పుడు తినాలంటే..?
చియా గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఫైబర్, ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఉదయం చియా గింజలు తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. ఇవి ఎక్కువసేపు ఆకలి లేకుండా చేస్తాయి. అందువల్ల ఎక్కువగా తినకుండా ఉండగలుగుతారు. జీర్ణక్రియ కూడా బాగుంటుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. దీంతో కేలరీలు తగ్గి బరువు తగ్గడం సులభమవుతుంది.