తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

NLG: రామన్నపేట మండల కేంద్రంలోనీ పీఎసీఎస్ సెంటర్‌లో తడిసిన ధాన్యాన్ని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగానే రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా రైతులకు కావాల్సిన కనీస సదుపాయాలు ఏర్పాటు చేయలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.