ఖాళీ బిందెలతో రోడ్డెక్కి తండావాసులు

ఖాళీ బిందెలతో రోడ్డెక్కి తండావాసులు

SRD: వారం రోజుల నుంచి తాగునీటి సరఫరా లేకపోవడంతో సిర్గాపూర్ మండలం జీవుల తండా ప్రజలు ఇవాళ రోడ్డెక్కి ధర్నా చేశారు. సిర్గాపూర్-ఖేడ్ వెళ్లే ఆర్ అండ్ బి రహదారిపై బైఠాయించి ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. దీంతో రాకపోకలు నిలిచాయి. తమ గ్రామం మంచినీటి సమస్యపై ఎవరు పట్టించుకోవడంలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.