ఎన్నికల దృష్ట్యా ప్రజావాణి కార్యక్రమం రద్దు: JC

ఎన్నికల దృష్ట్యా ప్రజావాణి కార్యక్రమం రద్దు: JC

ASF: 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ప్రతి సోమవారం డివిజన్ కేంద్రంలోని సబ్ కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా ఒక ప్రకటన‌లో వెల్లడించారు. ఎన్నికల అనంతరం తిరిగి ప్రారంభించే తేదీని త్వరలో తెలియజేస్తామన్నారు. ప్రజలు, దరఖాస్తుదారులు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరారు.