జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి: MLA
ఆసిఫాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జూనియర్ విభాగం ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన బాలుర జట్టు జిల్లా తరుపున ఆడటానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా జిల్లా జట్టు సభ్యులు సోమవారం MLA కోవ లక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిశారు. MLA యువ క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర స్థాయిలో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని వారికి సూచించారు.