VIDEO: గొల్లనపల్లిలో బహిరంగ సిలువ మార్గం కార్యక్రమం
కృష్ణా: గన్నవరం మండలంలోని గొల్లనపల్లిలో బుధవారం ప్రత్యేక బహిరంగ సిలువ మార్గం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆర్సీఎం చర్చి ఫాదర్ తోకల సురేశ్ ఆధ్వర్యంలో క్రైస్తవులు జపమాలలు జపిస్తూ, ఏసుక్రీస్తు కీర్తనలు పాడుతూ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం చర్చిలో ప్రత్యేక దివ్యప్రసాద ఆరాధనను నిర్వహించారు.