వనపర్తి జిల్లా ప్రజలకు ఉచిత మొబైల్ న్యాయ సేవలు
WNP: ఉచిత న్యాయ సహాయం, సలహాలు, గ్రామాల్లో లీగల్ అవేర్ నెస్ క్యాంపులు ఇతర అంశాలపై అవగాహన కల్పించేందుకు జిల్లాకు లోక్ అదాలత్ మొబైల్ వ్యాన్లు రానున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. ఆర్ సునీత, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి. రజని తెలిపారు. ఈ వ్యాన్ల ద్వారా వివాదాలను త్వరగా పరిష్కరించడం, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయ సలహాలు అందించవచ్చన్నారు.