సూర్య మూవీలో అనిల్ కపూర్.. క్లారిటీ

సూర్య మూవీలో అనిల్ కపూర్.. క్లారిటీ

తమిళ హీరో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి సినిమాలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ భాగం కానున్నట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా వీటిపై దర్శకుడు వెంకీ స్పందించారు. ఆయా వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. వాటిని ఖండించారు. ఇందులో అనిల్ నటించడం లేదని, తాము అసలు ఆయనను సంప్రదించలేదని వెల్లడించారు. ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మొద్దని తెలిపారు.