కృష్ణారెడ్డికి గ్రామస్థుల ఘన సన్మానం

ప్రకాశం: UPSCలో 350వ ర్యాంకును సాధించి ఐపీఎస్‌గా సెలెక్ట్ అయిన సింగరాయకొండ మండలం ఊళ్ల పాలెంకు చెందిన ఉదయ కృష్ణారెడ్డికి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. గ్రామానికి గుర్తింపు తెచ్చిన అతడిని ఘనంగా సన్మానించారు. కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. తాను కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సమయంలో తనకు ఎదురైన కొన్ని సంఘటనలతో తాను పట్టుదలతో చదివి ఐపీఎస్ సాధించానని అన్నారు.