కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా రాజేష్
PDPL: కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా నూతన కార్యవర్గంలోని నలుగురు అధికార ప్రతినిధుల్లో మంథనికి చెందిన సెగ్గెం రాజేష్‌కు చోటు దక్కింది. రాజేష్ గతంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా, మంథని మండల అధ్యక్షుడిగా, ఎంపీటీసీ సభ్యుడిగా పనిచేశారు. జిల్లాలో కాంగ్రెస్ బలోపేతానికి తన వంతు పాత్ర పోషిస్తానని రాజేష్ తెలిపారు.