GDK-11వ గనిని పరిశీలించిన అధికారులు

PDPL: రామగుండం సింగరేణి సంస్థ GDK- 11 బొగ్గు గనిని GM(సేఫ్టీ) మధుసూదన్, DO-2 GM గోపాల్ సింగ్ పరిశీలించారు. కార్మికుల డిస్ట్రిబ్యూషన్ పాయింట్ వద్ద ఉదయం షిఫ్టులో తీసుకోవాల్సిన భద్రత చర్యల గురించి కార్మికులకు వివరించారు. గనికి సంబంధించిన మ్యాపులను పరిశీలించారు. భూగర్భ గనిలో దిగి రక్షణ చర్యలపై కార్మికులకు సలహాలు, సూచనలు ఇచ్చారు.