'సూర్యనాగసన్యాసి రాజు అనే నేను'

విశాఖ: చోడవరం ఎమ్మెల్యేగా కే.ఎస్.ఎన్.ఎస్ రాజు ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ఆయనతో ప్రమాణం చేయించారు. కాగా ఇప్పటివరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి మూడుసార్లు విజయం సాధించారు. ఈసారి వైసీపీ అభ్యర్థి కరణం ధర్మశ్రీపై విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు.