"రావయ్యా-గణపయ్య"

HYD: నగరంలో రేపటి నుంచి వినాయక చవితి సందడి షురూ కానుంది. ఇప్పటికే వీధులు, కూడళ్లలో రంగురంగుల మండపాలకు భారీ గణపతి విగ్రహాలు ఆగమనం చేశాయి. దీంతో నగర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. ఇంటిల్లిపాది తమ పూజ గదిని ప్రత్యేకంగా ఆలకరించుకుని, గణపయ్య నవరాత్రులకు సిద్ధం అవుతున్నారు. 'రావయ్యా-గణపయ్య' అంటూ స్వాగతం పలుకుతున్నారు.