'23, 4, 234'.. తమిళనాట నెంబర్ గేమ్!

'23, 4, 234'.. తమిళనాట నెంబర్ గేమ్!

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల తేదీలపై నెట్టింట క్రేజీ చర్చ సాగుతోంది. ఏప్రిల్ 23న(23/4) పోలింగ్ జరగనుండగా, ఆ తేదీ అంకెలను కలిపి చూస్తే సరిగ్గా రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ సీట్ల సంఖ్య '234' వస్తోంది. ఈ వింత యాదృచ్చికాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరోవైపు మే '4'న ఫలితాలు విడుదల కానుండటంతో.. ఈ తేదీ కూడా ఆ 'నెంబర్ గేమ్'లో కలిసిపోయిందంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.