బిఎల్‌వోలకు విధులపై శిక్షణ కార్యక్రమం

బిఎల్‌వోలకు విధులపై శిక్షణ కార్యక్రమం

VZM: గజపతినగరం మండలంలోని మరుపల్లి గ్రామ పరిధిలో గల బాలాజీ పాలిటెక్నికల్ కళాశాలలో బిఎల్‌వోలకు విధులపై శిక్షణ కార్యక్రమం బుధవారం జరిగింది. గజపతినగరం నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి ప్రమీలాగాంధీ శిక్షణ కార్యక్రమాన్ని వినియోగించుకుని విధులు సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. తహసీల్దార్ రత్నకుమార్, ఎన్నికల ఉప తహసీల్దారు వెంకటలక్ష్మి పాల్గొన్నారు.