అమరావతికి రూ.15 వేల కోట్లు నిధులు వచ్చాయి

NTR: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం దేశ ప్రధాని నరేంద్ర మోదీ రూ.15 వేల కోట్ల గ్రాండ్ నిధులను విడుదల చేసి శంకుస్థాపనకు రావడం శుభ పరిణామం అని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుమారు 5 లక్షల మంది జన సమీకరణతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘనంగా స్వాగతం తెలుపుతున్నట్లు వెల్లడించారు.