మార్కెట్ ఆక్రమణలపై కమిషనర్ కొరడా
E.G: మండపేట పురపాలక సంఘ పరిధిలో కె.పి. రోడ్డులో సర్దార్ వేగుళ్ల వీర్రాజు మున్సిపల్ మార్కెట్‌లో ఆక్రమణలపై కమీషనర్ టీవీ రంగారావు కొరడా జూళిపించారు. సోమవారం కమిషనర్ ఆదేశాల మేరకు పట్టణ ప్రణాళిక విభాగం వార్డు ప్లానింగ్ సెక్రటరీల సిబ్బంది పూర్తిగా అక్కడ ఆక్రమించిన దుకాణాల వద్ద సామాగ్రిని పారిశుద్ధ్య సిబ్బందితో తీయించారు. అక్కడ ఉన్న చెత్తను తొలగించారు.