భర్త వేధింపులతోనే కొడుకును చంపి సూసైడ్..?

భర్త వేధింపులతోనే కొడుకును చంపి సూసైడ్..?

MNCL: ఓ కన్నతల్లి చేసిన నిర్వాకం కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. కొడుకును చంపి మందమర్రికి చెందిన తల్లి సత్యవాణి ఉరేసుకున్న ఘటన తెలిసిందే. అయితే, కట్నం వేధింపులే సత్యవాణి మృతికి కారణమని సోదరుడు ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్త మురళివేణు ఉద్యోగం వచ్చినప్పటి నుంచి కట్నం కోసం వేధిచేవాడని తెలిపారు. భర్త మాటలపై అనుమానం ఉందని, విచారణ జరపాలని పోలీసులను కోరారు.