రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

MBNR: భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఈద్గా, అమిస్తాపూర్ ఈద్గా వద్ద రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులను ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రంజాన్ పండుగ సౌభ్రాతృత్వం, శాంతి, సహనానికి ప్రతీకని పేర్కొన్నారు. సమాజంలో ఐక్యతను పెంపొందించే పండుగగా రంజాన్ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందన్నారు.