BREAKING: భారీగా డ్రగ్స్ పట్టివేత
మహారాష్ట్రలోని ముంబైలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఏకంగా రూ.200 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను మీరా రోడ్డు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఫ్యాక్టరీలో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాపై పోలీసులు మెరుపుదాడి చేశారు. ఈ ఆపరేషన్‌లో భారీ ఎత్తున డ్రగ్స్ నిల్వలు బయటపడటం కలకలం రేపుతోంది.