ఇలాంటి మామిడి పండును ఎప్పుడైనా తిన్నారా?
కోనసీమ: వేసవి కాలంలో భానుడు భగ్గుమనడం సహజమే. కానీ ఈ సీజన్‌లో దొరికే మామిడి మాత్రం అమోఘం. మామిడి అంటే ఇష్టపడని వారు ఉండరని చెప్పడం అతిశయోక్తి కాదు. ముఖ్యంగా మన గోదావరి జిల్లాలో దొరికే రసాల్లో 'చెరుకు రసం' రకం మామిడి ఎంతో ఫేమస్. పండును కోసి తినడం కంటే కూడా రసం తీసుకుని తాగడం దీని వెరైటీ. మరి ఈ వేసవి సెలవుల్లో ఈ పండ్లను తింటున్నారా? కామెంట్ చేయండి.