'హైడ్రా-రక్ష' పోర్టల్‌ను ప్రారంభించిన కమిషనర్

'హైడ్రా-రక్ష' పోర్టల్‌ను ప్రారంభించిన కమిషనర్

HYD: బాలానగర్‌లోని NRSC ప్రధాన కార్యాలయంలో ఇవాళ 'హైడ్రా-రక్ష' పోర్టల్‌ను హైడ్రా కమిషనర్ AV రంగనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీని ద్వారా ప్రజలు చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల వివరాలు తెలుసుకోవచ్చన్నారు. అలాగే NRSC ఉపగ్రహ డేటా HYDRAAకు చెరువుల FTL, బఫర్ హద్దులు గుర్తించడంలో కీలకంగా మారిందని, ఈ డేటాతో చెరువుల కబ్జాలను అరికట్టామని తెలిపారు.