సోలార్ రూఫ్‌టాప్ యూనిట్లను ప్రారంభించిన మంత్రి
అన్నమయ్య జిల్లా దేవగుడిపల్లెలోని బాపూజీనగర్ కాలనీలో విద్యుత్ వినియోగదారుల గృహలకు సోలార్ రూఫ్‌టాప్ యూనిట్లను మంత్రి రాంప్రసాద్ రెడ్డి, కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీల ఇళ్లను సౌర వెలుగులతో నింపి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.