వెల్లడైన మొదటి ఫలితం.. సర్పంచ్‌గా మహిళ గెలుపు
ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం సుస్మీర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా తొర్రెం చంద్రకళ గెలుపొందారు. బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన చంద్రకళ సమీప ప్రత్యర్థి మడే సుదాన్ భాయ్‌పై 67 ఓట్లతో గెలుపొందారు. తనను గెలిపించేందుకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.